TEJA NEWS

రోడ్లకు అడ్డంగా నిర్మిస్తున్న బడా సంస్తల అక్రమ నిర్మాణాల పై అధికారుల నిర్లక్ష్యం వీడాలి బీజేపీ నాయకులు పీసరి కృష్ణారెడ్డి

మల్లంపేట నుండి రెడ్డిల్యాబ్ పక్కన నుంచి ప్రణీత ఆంటీలియా మీదుగా మాస్టర్ ప్లాన్ రోడ్డు పాత హైదరాబాద్ రోడ్డుపై ఆక్రమణలు తొలగించాలని హెచ్ఎండిఏ ఉత్తర్వులు ఇచ్చిన అమలు చేయని నిజాంపేట మున్సిపల్ అధికారులు వైఖరికి నిరసనగా మున్సిపల్ కమీషనర్ కార్యాలయం ముందు మల్లంపేట్ కౌన్సిలర్ భర్త ఎంబరి ఆంజనేయులు కూర్చొని నిరసన తెలియజేయడం జరిగింది.

బీజేపీ నాయకులు పీసరి కృష్ణారెడ్డి వారికి సంగీభావం తెలపడం జరిగింది కృష్ణారెడ్డి మాట్లాడుతూ మల్లంపేటలో ప్రతి నిత్యం ట్రాఫిక్ రద్దీ వల్ల సుమారు రెండు గంటలు పైగా ట్రాఫిక్ లో ఇరుక్కోవడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు మున్సిపాలిటీల పరిధిలో కట్టే బిల్డింగ్ పైన ఉన్న శ్రద్ద రోడ్ల విస్తీర్ణం మరమ్మతుల రోడ్ల ఆక్రమించి కట్టే నిర్మాణాలపైన ఎలాంటి చర్యలు తీసుకోని అధికారులు

బౌరంపేట్ మల్లంపేట్ బాచుపల్లి గ్రామాలలో అధిక కాలనీలు కార్పొరేట్ స్కూళ్లు మరియు వీటికి మల్లంపేట్ ఎగ్జిట్ తోడు అవ్వడం వలన ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరగడం జరిగింది దీనికి తోడు బౌరంపేట్ మల్లంపేట్ 100 ఫీట్ల రోడ్డని గత ప్రభుత్వం ప్రారంభించి దాన్ని సగానికి కుదించడం సరైన పద్దతిలో పూర్తి చేయకపోవడం అధికార పార్టీ, అధికారులు నిర్లక్ష్యం వహించడం వలన ప్రజలు ట్రాఫిక్ సమస్య ఎదుర్కోవడం జరుగుతుంది

హెచ్ఎండిఏ కనీసం 40 ఫీట్ల రోడ్డు ఉంటేనే పర్మిషన్ ఇస్తారు కానీ మున్సిపాలిటీలలో అధికారులు ద్రుష్టి పెట్టి మున్సిపల్ పరిది గ్రామాలలో ప్రధాన రహదారులు కనీసం 40 ఫీట్లు అయినా ఉండేలా ఎలాంటి వారైనా నిర్మాణాలను ఉపేక్షించకుండా చర్యలు తీసుకోగలరని కోరడం జరిగింది

ఈ కార్యక్రమంలో నిజాంపేట్ మున్సిపల్ బీజేపీ మాజీ అధ్యక్షులు ఆకుల సతీష్ మల్లంపేట్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు


TEJA NEWS