సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని తెలంగాణ మైనారిటీ (బాలికల) గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన నూతన డైట్ మెను ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం ఏర్పాటుచేసిన గురుకుల పాఠశాలలు నేడు అత్యున్నత ఫలితాలు సాధిస్తూ ప్రభుత్వ విద్యా రంగంలో ఆదర్శంగా అనిపిస్తున్నాయని ఆయన తెలిపారు. గురుకుల పాఠశాల విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించాలన్న సమన్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం డైట్ చార్జీలు పెంచడం జరిగిందని గుర్తు చేశారు. ప్రతి విద్యార్థి శ్రద్ధతో చదివి నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి దేవుజా, పాఠశాల ప్రిన్సిపల్ శోభారాణి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…