TEJA NEWS

సీఎం చంద్రబాబుకు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి లేఖ

సీఎం చంద్రబాబుకు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి లేఖ
అంబేడ్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై స్పందన తెలియజేయాలని సీఎం చంద్రబాబును ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ లేఖ ద్వారా కోరారు. అంబేడ్కర్ ను అవమానించారని, ఆ వ్యాఖ్యలు సమర్థనీయం కాదన్నారు. అమిత్ షా కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదని, ప్రధాని మోదీ కూడా ఆయన్ను సమర్థిస్తున్నట్లు లేఖలో తెలిపారు. ఈ అంశంపై లోతుగా ఆలోచించాలని ప్రజలు ఆశిస్తున్నారని కేజీవాల్ లేఖలో పేర్కొన్నారు


TEJA NEWS