TEJA NEWS

అంబెడ్కర్ గారిని అవమానించింది కాంగ్రెస్సే …

మోడీజీ హాయంలోనే అంబెడ్కర్ కు అరుదైన గౌరవం..
సాక్షిత ధర్మపురి ప్రతినిధి:-
బిజెపి జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యమ్…

     పెగడపెల్లి :కాంగ్రెస్ హాయంలో అంబెడ్కర్  ని అడుగడుగునా అవమానించి అమిత్ షా గారు కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం బయటపెడితే జీర్ణిచుకోలేక  వ్యాఖ్యలను వక్రీకరించి ఇప్పుడు అంబెడ్కర్  గురించి మాట్లాడడం వంద ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రలు చేసినట్లుందని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యమ్ విమర్శించారు.ఈసందర్భంగా బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యమ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబెడ్కర్ గొప్ప జాతీయవాది అని నెహ్రు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో భారత రాజ్యాంగంలో 370 ఆర్టికల్ మరియు లౌకికవాదం అనే అంశాలను పొందుపరచాలని నెహ్రు కోరినప్పుడు  అది జాతీయ సమైక్యతకు భంగం కలిగిస్తుందని ముందే ఉహించి తిరస్కరించిన గొప్ప జాతీయవాదని అన్నారు. కానీ కొంతమంది లౌకికవాదం ముసుగులో అంబేద్కర్  ని అవమానిస్తున్నారని అన్నారు.అంబెడ్కర్  అప్పటి ప్రధాని నెహ్రు విధానాలు నచ్చక విభేదించడం వల్లనే 1952 లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో నెహ్రు అంబెడ్కర్ గారికి కాంగ్రేస్ టికెట్ ఇవ్వకుండా అవమానపరచి నెహ్రూ ఇంట్లో పని మనిషిని అంబెడ్కర్ పై పోటీకి దింపి వ్యతిరేక ప్రచారం చేసి అంబెడ్కర్ ను ఒడిస్తే అంబెడ్కర్ లాంటి మేధావులు చట్టసభల్లో అవసరం అని భావించిన డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జనసంఘ్ మద్దతుతో రాజ్యసభకు పంపించింది అన్నారు.గత ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలంటూ అంబెడ్కర్ ను అవమానించారని అసమయంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు స్పందించలేదని అన్నారు.అందుకే కాంగ్రెస్ బిఆరెస్ పార్టీలకు అంబెడ్కర్ గురించి మాట్లాడే నైతికహక్కు లేదన్నారు.2014 సంవత్సరంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాతనే అంబెడ్కర్  చిత్రపటాన్ని పార్లమెంటు సెంట్రల్ హాల్ లో ఆవిష్కరించారని వారు పుట్టిన చదివిన మరణించిన తదితర అయిదు ప్రదేశాలను పంచతీర్థాలుగా అభివృద్ధి పరిచి పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్ది అరుదైన గౌరవం ఇచ్చారని అన్నారు.అంతేకాకుండా అంబెడ్కర్ జయంతిని ప్రపంచ విజ్ఞాన దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి చేత ఆమోదింపజేసిన ఘనత మోడీగారిదే అన్నారు. 

అంబెడ్కర్ ఆశయాలను తూ.చ తప్పకుండా పాటిస్తూ రాజ్యాంగ బద్ధమైన పరిపాలనా అందిస్తున్నారని అందుకే రాజ్యాంగానికి లోబడి 370 ఆర్టికల్ ట్రిపుల్ తలాక్ లాంటివి నిషేధించి పెద్దనోట్లు రద్దుచేసి తీవ్రవాదాన్ని మట్టు బెట్టారని అన్నారు. 2019లో పార్లమెంట్ ఎన్నికల తరువాత మోడీగారి క్యాబినెట్లో  12 మంది దళితులకు 8 మంది గిరిజనులకు స్థానం కల్పించి సామాజిక సమానత్వం చాటుకున్నారని కొనియాడారు. అంతేగాకుండా భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26న భారత పార్లమెంట్ చేత ఆమోదించబడి  1950 జనవరి  26 రోజున అమలులోకి వచ్చింది కాబట్టి నవంబర్ 26రోజును భారత జాతీయ రాజ్యాంగ దినోత్సవంగా 2015లో  బీజేపీ ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని అంబేద్కర్ గారికి అరుదైన గౌరవం ఇచ్చిందన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఏర్పాటైనా తెలంగాణ రాష్ట్రంలో గత ముఖ్యమంత్రి ఏనాడు అంబేద్కర్  చిత్రపటానికి కనీసం దండవేసి దండం పెట్టిన పాపానా పోలేదన్నారు.అంబేద్కర్  జయంతిని ప్రపంచ విజ్ఞాన దినోత్సవంగ ఐక్యరాజ్య సమితి చేత ఆమోదింపజేసిన ఘనత మోడీగారిదేనని అన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం ముస్లింల మెప్పు కోసం తెచ్చిన వక్ఫ్ బోర్డు చట్టం అంబెడ్కర్ రాసిన రాజ్యాంగంలో  లేదని అందుకే వక్ఫ్ బోర్డు చట్టానికి సవరణ చేయాల్సిందేనని కుండబద్దలు కొట్టినట్టు చెప్తున్నారని అన్నారు.కాంగ్రెస్ పార్టీకి అంబెడ్కర్ అంటే గిట్టదు కాబట్టే 1993లో భారతరత్న ప్రకటించి ప్రధానం చేయకుండా కాలయాపన చేస్తే మోడీజీ ప్రధాని అయ్యాకే భారతరత్న అందజేసి అంబెడ్కర్  గౌరవాన్ని కాపాడరని అన్నారు.ఈసమావేశంలో బిజెపి మండల అధ్యక్షులు గంగుల కొమురెల్లి మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చింతకింది అనసూర్య మండల నాయకులు పెంట నరేందర్, తడగొండ అంజి, చింతకింది కిషోర్ తదితరులు పాల్గొన్నారు..

TEJA NEWS