TEJA NEWS

విద్యార్థులు గణితంపై ఆసక్తిని పెంపొందించుకోవాలి: డిప్యూటీ మేయర్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు

డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రంగరాయ ప్రసాద్ ముఖ్య అతిధులుగా నిజాంపేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత శాస్త్ర వేత్త శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని పాఠశాలలో విద్యార్థులు నిర్వహించిన మ్యాథ్స్‌ మేళాలో పాల్గొనడం జరిగింది. మొదటిగా విద్యార్థులు గణిత శాస్ర్తనికి సంబంధించిన వివిధ పరికరాలను తయారు చేసి మేళాలో ప్రదర్శించారు. అనంతరం డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చిన్నప్పటి నుంచే గణితంపై ఆసక్తి కలిగి ఉండాలని అన్నారు.విద్యార్థి దశ నుంచే గణితంపై దృష్టి సారించి బాలమేధావులుగా ఎదగాలని కోరారు,గణిత శాస్త్రం మానవ, సామాజిక అభివృద్ధిలో ఎంతో ప్రాముఖ్యత కలదని, గణితం లేకుండా మానవ ప్రగతిని, అభివృద్ధిని ఊహించలేమని తెలుపుతూ…విద్యార్థినులు తయారు చేసిన కృత్యాలను తిలకించి, అనంతరం క్విజ్‌ , రంగోలి, గణిత నమూనాలా ప్రదర్శన వంటి నిర్వహించిన పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుడు రఘునాథ్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు


TEJA NEWS