కేసీఆర్, కేటీఆర్‌లవి తీవ్రమైన నేరాలు: CM రేవంత్
కేసీఆర్, కేటీఆర్‌లవి తీవ్రమైన నేరాలు: CM రేవంత్
TG: రాష్ట్రంలో పదేళ్ల BRS పాలనలో ప్రజల సొమ్ము దోపిడీ, ఆర్థిక విధ్వంసం జరిగాయని.. వారి భూబాగోతాలు, అక్రమాలు బయటపడకుండా ఉండేందుకు అసెంబ్లీ సమావేశాల్ని జరగనీయకుండా అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. ధరణి పోర్టల్, ఔటర్ రింగ్ రోడ్, ఫార్ములా ఈ-రేసు విషయాల్లో కేసీఆర్, కేటీఆర్‌లు చేసినవి తీవ్రమైన నేరాలనీ.. వారికి ఏ శిక్ష విధించాలని ఆయన ప్రశ్నించారు. ఫార్ములా ఈ-రేసుపై చర్చకు సిద్ధమని ఆయన ప్రకటించారు.