రక్తదానం ప్రాణదానంతో సమానమే..
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్…
కామారెడ్డి జిల్లా కలెక్టర్ లో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లా రెడ్ క్రాస్ సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమనీ జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రక్తదానం ఏర్పాటు చేసినందుకు జిల్లా వ్యవసాయ అధికారి రాయుడు తిరుమల ప్రసాద్ ను అభినందించడం జరిగింది. చిట్యాల వ్యవసాయ విస్తరణ అధికారిగా విధులు నిర్వహిస్తూ 26 సార్లు రక్తదానం చేసి ఆదర్శంగా నిలుస్తున్న రెడ్డిగారి అశోక్ రెడ్డిని సన్మానించడం జరిగింది.
ఈ సందర్భంగా రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ రాజన్న,సమన్వయకర్త డాక్టర్ బాలు లు తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు అత్యధిక యూనిట్ల రక్తాన్ని అందజేసిన ఘనత కామారెడ్డి జిల్లాకు ఉన్నదనీ దీనిని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా గుర్తించడం జరిగిందని,జిల్లాలో స్వచ్ఛందంగా చాలామంది రక్తదాతలు రక్తదానానికి ముందుకు రావడం తెలంగాణ రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాను ఆదర్శంగా ఉంచారని కలెక్టర్ తెలియజేయడం జరిగింది.రక్తదానానికి ముందుకు వచ్చిన రక్తదాతలను అభినందించడం జరిగింది. 26 యూనిట్ల రక్తాన్ని సేకరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో టిఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నరాల వెంకట్ రెడ్డి,రెడ్ క్రాస్ సభ్యులు డాక్టర్ నరసింహము,బ్లడ్ బ్యాంక్ సిబ్బంది ప్రమోద్,అమర్,అరుణ్,పోషెట్టి, జిల్లా వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ అధికారులు పాల్గొనడం జరిగింది.