TEJA NEWS

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కుమార్తెపై కన్నతండ్రి అత్యాచారం చేసిన ఘటనలో నిందితుడికి నాంపల్లికోర్టు 25ఏళ్ల జైలుశిక్ష విధించింది. బాధిత యువతికి రూ.7లక్షలు పరహారం చెల్లించాలని తీర్పు వెలువరించింది. పోలీసుల కథనం ప్రకారం…బోయిన్‌పల్లిలో నివాసం ఉండే  రమేష్‌, సరోజాలకు 25 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె ఉంది. ఇద్దరి మధ్య గొడవల కారణంగా పదేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత రమేష్‌ .. రజిత అనే మరో మహిళలను పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య కూతరు తనతో పాటే ఉండటంతో ఆమెపై కన్నేసి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. 2022లో ఒకరోజు రాత్రి.. మొదటి భార్య కుమార్తెపై  బలవంతంగా అత్యాచారం చేస్తుండగా.. రజిత చూసి కేకలు వేసి ఆమెను కాపాడింది. అనంతరం బోయిన్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులకు విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నాంపల్లి కోర్టులో నేరం రుజువుకాడంతో మంగళవారం తీర్పు వెలువడింది.


TEJA NEWS