TEJA NEWS

ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పరిశీలిస్తున్న డిపిఓ

సూర్యపేట జిల్లా : మండల పరిధిలోని టేకుమట్ల గ్రామంతో పాటు వివిధ గ్రామాల్లో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేను డిపిఓ నారాయణరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దరఖాస్తుదారులు ఎన్యుమరేటర్లకు సహకరించి తమ కుటుంబ వివరాలను అందజేయాలని సూచించారు. ఇంటింటికీ వెళ్లి సర్వేచేసి వివరాలను ఇందిరమ్మ యాప్ లో నమోదు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎన్యుమరేటర్ నరసింహారావు మల్టిపర్పస్ వర్కర్స్,దరఖాస్తుదారులు పాల్గొన్నారు.


TEJA NEWS