TEJA NEWS

భారతదేశ ఆర్ధిక , ఆధ్యాత్మిక , ఆధ్యుడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి మరణం పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపిన — మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

మాజీ ఎమ్మెల్యే నివాసం వద్ద మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన కూన శ్రీశైలం గౌడ్ …

ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ… 1982 నుండి 1985 వరకు RBI గవర్నర్, 1991 నుండి 1996 వరకు భారతదేశ ఆర్థిక మంత్రిగా మరియు 2004 నుండి 2014 దేశ ప్రధానిగా పనిచేసి భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ప్రత్యేక సంస్కరణలు రూపొందించారు.. అలాగే పేద ప్రజల మనుగడ కోసం ఉపాధి హామీ పథకం, ఆహార భద్రత పథకలు ప్రవేశపెట్టి విదేశీ వ్యాపార వర్తక పెట్టుబడులను ఆకర్షించారు..

భారతదేశ చరిత్రలోనే మొదటిసారిగా రుణమాఫీ పరిచయం చేసిన మహోన్నుడు మన్మోహన్ సింగ్ .. 2008లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా మూడు కోట్ల మంది రైతులకు 72,000 కోట్ల రుణమాఫీ మన్మోహన్ సింగ్ హయాంలో జరిగిందన్నారు..

ఉమ్మడి తెలుగు రాష్ట్రాల చిరకాల కోరిక రాష్ట్ర విభజన అనుకూల,అననుకూల పరిస్థితులను ఆలోచించి రాష్ట్ర విభజనకు ప్రత్యేక చొరవ తీసుకున్నారు అని తెలిపారు..

ఈ సంతాప కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మున్సిపాలిటీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, మాజీ కౌన్సిలర్ ఆరిఫ్ కంటెస్టెంట్ కార్పొరేటర్స్ బండి శ్రీనివాస్ గౌడ్, బాలప్ప, ఇలయ్యగౌడ్, శ్రీనివాస్ యాదవ్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుచ్చిరెడ్డి, బలరాం, చౌడశ్రీనివాస్, కూన రాఘవేందర్ గౌడ్, నాగిళ్ల శ్రీనివాస్, ప్రభాకర్ రెడ్డి మాజీ సర్పంచ్, ఏమో సాగర్, గౌరీశెట్టి శివ, కృష్ణ యాదవ్, సుశాంత్, మధు, అరుణ్ గౌడ్, కే శంకర్, విజయ్ గుప్తా, తోకల శ్రీను, సంతోష్, వీరబాబు, బిల్లా, గుమస్తా మధుసూదన్, అరుణ్ కుమార్, రామకృష్ణారెడ్డి, భాగ్యలక్ష్మి మరియు మైనార్టీ నాయకులు ఖాజా భాయ్, చాంద్ పాషా, షాకీర్, మక్బుల్ బాయ్, లాల్ మహమ్మద్, చోటు, తోఫిక్, జాంగిర్ తదితరులు పాల్గొన్నారు..


TEJA NEWS