TEJA NEWS

ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న అవినీతి అనకొండలపై ఏసీబీ కొరడా.. లెక్కలు తేలుస్తున్న తెలంగాణ ఏసీబీ ఐ జి..సి వి.ఆనంద్ ..!

తెలంగాణలో అవినీతి అధికారుల భరతం పడుతున్నారు ఏసీబీ అధికారులు.

అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న పలువురు అధికారులను ఏసీబీ అధికారులు అరెస్టు చేస్తోంది.

చిన్న పనులకు సైతం లక్షల్లో లంచం డిమాండ్ చేస్తూ, ప్రజల కష్టార్జితాన్ని పిలిచి పిప్పి చేస్తున్నారు పలువురు ప్రభుత్వ ఉద్యోగులు.

అలాంటి అవినీతి అనకొండలపై ఏసీబీ కొరడా ఝలిపిస్తోంది.

ఒక బాలకృష్ణ, ఒక జ్యోతి, ఒక సత్యనారాయణ, ఒక లచ్చు నాయక్.. వీరంతా ప్రభుత్వంలో పని చేస్తున్న ఉన్నతాధికారులు.

ప్రజలకు అందించాల్సిన సేవలను నిర్వర్తించడం వీరి కర్తవ్యం. కానీ వీరు తమ కర్తవ్యాన్ని అడ్డం పెట్టుకుని సొంత అక్రమ ఆర్ధిక సంపాదనను అంతకింతకు పెంచుకుంటూ పోతున్నారు.

ప్రభుత్వ ఉద్యోగిగా ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు ప్రజల కష్టార్జితాన్ని పీల్చి పిప్పి చేసి, చిన్న పనులకు సైతం లక్షల రూపాయల లంచాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి శాఖలోనూ అవినీతి అనకొండలు ఉన్నారు. వీరి భరతం పట్టేందుకు ఏసీబీ అధికారులు సైతం సిద్ధంగా ఉన్నారు. ఇటీవల కాలంలో ప్రజల నుండి లంచం డిమాండ్ చేస్తున్న పలువురు అధికారులను ఏసీబీ అరెస్టు చేసింది.

అవినీతి అక్రమార్కుల భరతం పడుతున్నారు ఏసీబీ అధికారులు. గత కొన్ని నెలల వరకు కేవలం ట్రాప్ కేసులపై మాత్రమే దృష్టి సారించింది. ఏసీబీ ఐజీగా సీవీ ఆనంద్ బాధ్యతలు చేపట్టిన అనంతరం అధికారులు మరింత దూకుడు పెంచారు. ఆదాయానికి నుంచి ఆస్తులు కూడపెట్టుకున్న అధికారుల కేసులను ఏసీబీ ఫోకస్ చేసింది. రానున్న రోజుల్లో మరి కొంతమంది అధికారులపైన ఏసీబీ కొరడా ఝలిపించనున్నట్లు సమాచారం.


TEJA NEWS