
గాజులరామారం సర్కిల్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీలో మంజూరైన సిసి రోడ్లను పరిశీలించిన మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్….
కుత్బుల్లాపూర్ నియోజక వర్గ పరిధిలోని గాజులరామారం సర్కిల్ పరిధిలో గల శ్రీరామ్ నగర్ కాలనీ ఎంఏ ఫంక్షన్ హాల్ నుండి మంజూరైన ఎనిమిది అంతర్గత సిసి రోడ్లను స్థానిక *మాజీ శాసనసభ్యులు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ బస్తీలో తిరుగుతూ మంజూరైన రోడ్లను పరిశీలించడం జరిగింది..
ఈ సందర్భంగా వారు కాలనీలలో తిరుగుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్ బాబు కుత్బుల్లాపూర్ నియోజక వర్గం పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారని వాటిలో భాగంగా 55 లక్షల రూపాయలతో మంజూరైన ఈ రోడ్లను పరిశీలించడం జరిగింది,గత బిఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాలపాటు ఎక్కడ అంతర్గత రోడ్లు మరియు డ్రైనేజీ వ్యవస్థలను ఏర్పాటు చేయలేదని పూర్తిగా నిర్వీర్యం చేసి ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని విమర్శించారు…
ఈ సందర్భంగా కాలనీవాసులు సిసి రోడ్లను మంజూరు చేయించిన మాజీ శాసనసభ్యులు శ్రీశైలం గౌడ్ కి శాలువాతో సత్కరించి ధన్యవాదాలు తెలియజేశారు..
ఈ కార్యక్రమంలో స్థానిక కాలనీవాసులు హరీష్, రాకేష్, మధు, అశ్వత్, అనురాధ, సల్మాన్, నాగరాజు, రఫీ, ఇలియాస్, దశరథ్ మరియు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..