ప్రగతి నగర్, రాజీవ్ గృహకల్ప, ఏరో నగర్, కె.వి.ఆర్ వ్యాలీ ప్రాంతాల్లో నీటి సమస్యలపై (HMWSS&B) ఎండీని కలిసిన కొలన్ హన్మంత్ రెడ్డి

TEJA NEWS

ప్రగతి నగర్, రాజీవ్ గృహకల్ప, ఏరో నగర్, కె.వి.ఆర్ వ్యాలీ ప్రాంతాల్లో నీటి సమస్యలపై (HMWSS&B) ఎండీని కలిసిన కొలన్ హన్మంత్ రెడ్డి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని ప్రగతి నగర్ (సి.ఎం.సి-276 డివిజన్), జగద్గిరిగుట్ట రాజీవ్ గృహకల్ప (రాజీవ్ హిల్స్), గాజులరామారం డివిజన్‌లోని ఏరో నగర్ మరియు మల్లంపేట్‌లోని కె.వి.ఆర్ వ్యాలీ ప్రాంతాల్లో నెలకొన్న నీటి సమస్యలపై కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWS&SB) మేనేజింగ్ డైరెక్టర్ ని కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా హన్మంతన్న మాట్లాడుతూ, ప్రాంతాల్లో తాగునీరు, నిత్యావసర అవసరాలకు సరిపడా నీటి సరఫరా లేకపోవడం, క్రమరహిత నీటి పంపిణీ, పైప్‌లైన్ లీకేజీలు, అనధికారిక నీటి ట్యాంకర్ల నిర్వహణ వంటి సమస్యలను ఎండీ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే రాజీవ్ గృహకల్పలో పెరిగిన జనాభాకు అనుగుణంగా నీటి సరఫరా పెంచడం, 5 బోర్‌వెల్‌ల ఏర్పాటు మరియు అర్హులైన కుటుంబాలకు వ్యక్తిగత నీటి కనెక్షన్లు మంజూరు చేయాలని , ఆయా ప్రాంతాల ప్రజలు చాలా కాలంగా తాగునీరు మరియు నిత్యావసర నీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

వినతిపత్రాన్ని స్వీకరించిన (HMWS&SB) ఎండీ సమస్యలను పరిశీలించి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి, అతి త్వరలో పరిష్కార చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ప్రగతి నగర్ మాజీ కార్పొరేటర్ చిట్ల దివాకర్ , సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆలేటి శ్రీనివాసరావు ,సిద్ధనోళ్ల సంజీవరెడ్డి, మురళీకృష్ణ, నారాయణరెడ్డి, ప్రశాంత్ రెడ్డి, సురేంద్ర కుమార్, ఆదిరెడ్డి, దాసరి మహేష్ కుమార్ పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top