రెండేళ్ల కూటమి పాలనలో ప్రగతి పథంలో రాష్ట్రం

TEJA NEWS

రెండేళ్ల కూటమి పాలనలో ప్రగతి పథంలో రాష్ట్రం

కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

నెల్లూరులో ఘనంగా జిల్లా స్థాయి విజయోత్సవం

రెండేళ్ల కూటమి పాలనలో రాష్ట్రం ప్రగతి పథం లో పయనిస్తోందని కోవూరు శాసన సభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు.రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువనేత నారా లోకేష్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా నెల్లూరులోని కస్తూరిదేవి గార్డెన్స్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయోత్సవ సంబరాలులో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తో కలసి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రెండేళ్ల క్రితం ఎన్నికల ముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు కూటమికి అధికారమిచ్చారన్నారు.నేడు ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని అక్షరాల నిజం చేసి ఎంతో గర్వంగా వారి ముందుకువచ్చామని హర్షం వ్యక్తం చేశారు.ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ‘సూపర్ సిక్స్’ పథకాలను ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఒకటో తేదీకల్లా అవ్వాతాతల చేతుల్లో పెన్షన్ పెడుతున్నామని, ‘తల్లికి వందనం’ కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ఆర్థిక సాయాన్ని తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నామని తెలిపారు. ‘స్త్రీ శక్తి’ పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించామని, ‘అన్నదాత సుఖీభవ’ ద్వారా ప్రతి రైతు ఖాతాలో రూ. 20 వేలు పడేలా చూస్తూనే, మత్స్యకార భరోసా రూ.20 వేల ను కూడా అందిస్తున్నామని వివరించారు. పేద ప్రజల ఆకలి తీర్చేందుకు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 200 పైగా ‘అన్నా క్యాంటీన్లు’ ఏర్పాటు చేశామని, రాబోయే రోజుల్లో వీటి సంఖ్య మరింత పెరుగుతాయన్నారు. పల్లెలను పట్టణాలుగా తీర్చిదిద్దుతామన్న డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ పిలుపునకు అనుగుణంగా గ్రామీణ రోడ్ల రూపురేఖలు మార్చామని ప్రశాంతి రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వంలో కేవలం కొబ్బరికాయలు కొట్టి వదిలేసిన ముదివర్తి కాజ్వే, మల్దేవి డ్రైన్లను, అలాగే పీటర్స్ కెనాల్ బ్రిడ్జ్ వంటి ఎన్నోపనులను, కల్వర్టులను ఈ రెండేళ్లలోనే పూర్తి చేశామన్నారు.

You cannot copy content of this page

Scroll to Top