వేములవాడ: మార్చి 07
మహాశివరాత్రి వేడుకలకు వేములవాడ శ్రీ రాజరాజే శ్వర స్వామి దేవాలయం ముస్తాబైంది. నేటి నుంచి మూడురోజుల పాటు జాతర మహోత్సవాలు జరగనున్నాయి.
నేడు రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు కొండా సురేఖ పొన్నం ప్రభాకర్ పట్టువస్త్రాలు సమర్పించ నున్నారు. టీటీడీ తరపున పట్టు వస్త్రాలను అధికారు లు సమర్పించనున్నారు.
రెండువేల మంది పోలీసు లతో పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ సుమారు వెయ్యి బస్సులను ఏర్పాటు చేసింది.
రాజన్న దర్శనానికి నాలుగు న్నర లక్షల మంది వస్తారని అధికారుల అంచనా. భక్తుల కు ఇబ్బందులు తలెత్తకుం డా ఆలయ అధికారులు ఏర్పాట్లను చేశారు