TEJA NEWS

ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న ప్రముఖ ఎడ్‌టెక్‌ కంపెనీ బైజూస్‌లో సంక్షోభం మరింత ముది రినట్లు కనిపిస్తోంది. సంస్థ భారతీయ విభాగం సీఈఓ అర్జున్‌ మోహన్‌ రాజీనామా చేశారు.

దీంతో సంస్థ రోజువారీ కార్యకలాపాలను వ్యవ స్థాపకుడు బైజూ రవీంద్రన్‌ పర్యవేక్షించనున్నట్లు కంపెనీ తెలిపింది.

రవీంద్రన్‌కు అత్యంత నమ్మకస్థుడిగా అర్జున్‌ మోహన్‌కు సంస్థలో పేరుంది. రవీంద్రన్‌ క్యాట్‌ కోచింగ్‌ ఇస్తున్న తొలినాళ్లలో అర్జున్‌ ఆయనకు స్టూడెం ట్‌. ఆయన సీఈఓ బాధ్యత లు చేపట్టి ఆరు నెలలే అవు తోంది.

సంస్థ పునర్‌వ్యవస్థీకరణ కీలక దశలో ఉన్న తరుణంలో రాజీనామా చేయడం గమనార్హం. కానీ, సంస్థకు సలహాదారుడిగా మాత్రం ఆయన కొనసాగనున్నట్లు సమాచారం….


TEJA NEWS