TEJA NEWS

శ్రీ శ్రీ శ్రీ సీతారామాంజనేయ, శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వేంకటేశ్వర శ్రీ శివపంచాయతన శ్రీ లలితా పరమేశ్వరి నవగ్రహ ప్రతిష్టా,శ్రీ వెంకట శివ రామాలయ ప్రతిష్టా, మహకుంభాభిషేక మహోత్సవ వేడుకలో పాల్గొన ఎమ్మెల్యే, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద, డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, కార్పొరేటర్లు ఇతర ముఖ్యులు ముఖ్య అతిధులుగా…
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 17వ డివిజన్ కౌసల్య కాలనీ లో స్థానిక డివిజన్ కార్పొరేటర్,ఆలయ కమిటీ ఛైర్మెన్ ఆగం రాజు ముదిరాజ్ ,కార్పొరేటర్ ఆగం పాండు ముదిరాజ్ ఆధ్వర్యంలో శ్రీ శ్రీ శ్రీ సీతారామాంజనేయ,శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వేంకటేశ్వర శ్రీ శివపంచాయతన శ్రీ లలితా పరమేశ్వరి నవగ్రహ ప్రతిష్టా,శ్రీ వెంకట శివ రామాలయ ప్రతిష్టా, మహకుంభాభిషేక మహోత్సవ వేడుకలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అనంతరం అతిథులను ఘనంగా సన్మానించి,ఆలయ మెమోంటో లను అందించడం జరిగింది.ఈ వేడుకలో కార్పొరేటర్లు బాలాజీ నాయక్, కో ఆప్షన్ సభ్యులు ఏనుగుల అభిషేక్ రెడ్డి, సీనియర్ నాయకులు చంద్రగిరి సతీష్, సంబశివా రెడ్డి, శ్రీకర్ గుప్త, నాయకులు దశరథ్, స్వామి, యువ నాయకులు,మహిళా నాయకులు, కౌసల్య కాలనీ వాసులు,స్థానిక డివిజన్ ఆయా కాలనీ వాసులు, భక్తులు, ఇతర ముఖ్యులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


TEJA NEWS