పాలకుర్తి నియోజకవర్గ పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహాక సమావేశం లో పాల్గొన్న వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు
వరంగల్ జిల్లా….
పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన వరంగల్ పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహాక సమావేశం లో వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య మరియు వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి & పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి మరియు సహచర శాసనసభ్యులు పాలకుర్తి శాసనసభ్యులు మామిడాల యశస్వినిరెడ్డి, స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి, భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు తో కలిసి పాల్గొన్న వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపిఎస్ అధికారి కేఆర్ నాగరాజు . అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బిజెపి మతపరమైన రాజకీయం చేస్తుందని రాముని పేరు చెప్పి ఓట్లు దండుకుంటామని మళ్ళీ మన ముందుకు వస్తున్నారని రాముడు ఒక బీజేపీ పార్టీకే సొంతం కాదు మనందరికీ దేవుడు అని తెలియజేస్తూ మీరు మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లో మీరు ఎలా అయితే పాలకుర్తి నియోజకవర్గం లో యశస్విని రెడ్డిని అత్యధిక జట్టుతో గెలిపించారో అలాగే పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కడియం కావ్య ని గెలిపించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలను విస్తృత స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లి రాబోయే రోజుల్లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే మరింత నిధులు తీసుకొని వస్తుంది కాబట్టి మన వరంగల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎన్నికల సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే తెలియజేశారు… ఈ సన్నాహక సమావేశంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, మాజీ వరంగల్ ఎంపి పసునూరి దయాకర్, కత్తి వెంకటస్వామి, ఆనంద్, పార్లమెంట్ నియోజకవర్గంలోని సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు….