ఘనంగా శ్రీశ్రీశ్రీ బీరప్ప స్వామి కామారాతి కళ్యాణ మహోత్సవం…

ఘనంగా శ్రీశ్రీశ్రీ బీరప్ప స్వామి కామారాతి కళ్యాణ మహోత్సవం…

TEJA NEWS

132 – జీడిమెట్ల డివిజన్ బీరప్ప నగర్ లో నిర్వహిస్తున్న శ్రీశ్రీశ్రీ బీరప్ప స్వామి కామారతి కళ్యాణ మహోత్సవానికి ఎమ్మెల్యే కేపీ. వివేకానంద గారు ముఖ్యఅతిథిగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ. వివేకానంద గారు మాట్లాడుతూ స్వామివారి కరుణ కటాక్షాలతో ప్రజలంతా సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో జీవించాలన్నారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు నదీమ్ రాయ్, కాలే గణేష్, దేవాలయ కమిటీ చైర్మన్ నార్లకంటి నాగేష్, పెద్ద కురుమ యాదయ్య, సెల్వోజి సత్తయ్య, టెంపర్ ప్రెసిడెంట్ నార్లకంటి చంద్రయ్య, కుత్బుల్లాపూర్ నియోజక వర్గం కురుమ సంఘం అధ్యక్షులు పాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి కుంటి మల్లేష్, కురుమ సంఘం సభ్యులు ప్రతాప్, ఉలిపి మల్లేష్, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS