TEJA NEWS

జనవరి 22న డెలివరీ చేయండి: గర్భిణీ మహిళల విన్నపం

న్యూ డిల్లీ: జనవరి 08
యావత్ భారతదేశం జనవరి 22వ తేదీ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంది. ప్రస్తుతం అయోధ్యలో పండగ వాతావరణం కూడా నెలకొంది.

ఇప్పటికే అన్ని రకాల కార్య క్రమాలు పూర్తయ్యాయి . దేశ నలుమూలల నుంచి హిం దువులు ఈ అపురూప ఘట్టాన్ని వీక్షించేందుకు అయోధ్య వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అయోధ్య పట్టణంలోని హోటల్స్‌ అన్నీ బుక్‌ అయిపోయాయి.

ఇదిలా ఉంటే రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేసే రోజే, తాము బిడ్డకు జన్మనివ్వాలని కొందరు గర్భిణీలు కోరుకుంటు న్నారు. ఉత్తర్‌ ప్రదేశ్‌కి చెందిన నెలల నిండిన గర్భిణీలు జనవరి 22వ తేదీ రోజునే తమకు ఆపరేషన్లు చేయాలని డాక్టర్లను కోరుకుంటున్నారు.

ప్రస్తుతం నెలలు నిండి ప్రసవానికి సిద్ధంగా ఉన్న వారు సైతం జనవరి 22వ తేదీ వరకు ఆపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక జనవరి 22 వ తేదీ వరకు నెలలు పూర్తిగా నిండని వారు కూడా కొంత ముందస్తు గానే.. జనవరి 22 వ తేదీన తమకు ఆపరేషన్లు చేసి బిడ్డలను బయటికి తీయా లని వేడుకోవడం గమనార్హం.

అయితే వైద్యులు మాత్రం గర్భిణీ ఆరోగ్య పరిస్థితి ఆధారంగా నిర్ణయం తీసు కొంటాం అంటున్నారు


TEJA NEWS