TEJA NEWS

మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ……

మనలో సోదర భావాన్ని పెంపొందించే ఇఫ్తార్ విందు దోహదం చేస్తుంది…

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ముస్లింలకు పెద్దపీట వేస్తుంది…

దావత్ – ఏ – ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ….

హనుమకొండ జిల్లా….
మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ దావత్ – ఏ – ఇఫ్తార్ విందు కార్యక్రమం ఉంటుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు అన్నారు. రోజున బట్టుపల్లి లోని AGR గార్డెన్స్ నందు 3,14, 43,44, 45, 46, 64, డివిజన్ల లోని మైనారిటీ సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన దావత్ – ఏ – ఇఫ్తార్ ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథులుగా వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు గారు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మహమ్మద్ అజీజ్ ఖాన్ పాల్గొన్నారు….

అనంతరం సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లిం సోదరులకు ఫలహారాలు తినిపించి ఉపవాస దీక్ష విడిపించారు..

అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ:-..

రంజాన్ మాసం పవిత్రమైన మాసం అన్నారు. రంజాన్ మాసంలో కఠోర నియమాలతో ఉపవాస దీక్షలు చేపడుతారని అన్నారు. మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని అన్నారు. ఇఫ్తార్‌ విందుతో సోదరభావం పెంపొంది లౌకిక విలువలు కాపాడుతూ ప్రజల మధ్య ఐక్యత భావం పెంచుతుందంటారు. చిన్నపిల్లల నుంచి మొదలుకొని వృద్ధుల వరకు రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేయడం గొప్ప విషయమన్నారు. అల్లా ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.,

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని రంగాల్లోనూ తెలంగాణలో పురోగమించేలా, దేశంలోనే అగ్రరాజ్యంగా ఆవిర్భవించాలని కోరుతూ పవిత్ర రంజాన్ మాసంలో ప్రత్యేకంగా ప్రార్థనలు చేయాలని ఆయన ముస్లిం సోదరులకు విజ్ఞప్తి చేశారు.

రంజాన్ ఇఫ్తార్ విందుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేసిందని, వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలో ప్రధాన మసీదుల్లో ఇఫ్తార్ వేడుకలకు నిధులను కేటాయించిందని తెలిపారు….

ఈ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు ఎమ్మెల్యే నాగరాజు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు…..

ఈ కార్యక్రమంలో ఆర్టీవో వాసుచంద్ర, ఎమ్మార్వో బావుసింగ్
, అధికారులు, కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు, మైనార్టీ సోదరులు ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు కార్యకర్తలు వివిధ అనుబంధ సంఘాల నాయకులు మహిళలు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు….