టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి ఆధ్వర్యంలో ఎల్.బి నగర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జక్కిడి ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలో హయత్ నగర్, మాన్సూరాబాద్, నాగోల్ డివిజన్ ల కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులతో ఆత్మీయ సమేళనం నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన మల్కాజ్ గిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి , మాజీ మంత్రి, ప్రస్తుత MLC పట్నం మహేందర్ రెడ్డి పాల్గొన్నారు..
ఈ కార్యక్రమం లో నియోజకవర్గ స్థాయి సీనియర్ నాయకులు, డివిజన్ ల అధ్యక్షులు, మహిళా నాయకులు, బూత్ స్థాయి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.