TEJA NEWS

ఖమ్మం పార్లమెంట్ భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్ రావు జిల్లా సెషన్స్ కోర్ట్ బార్ అసోసియేషన్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వినోద్ రావు మాట్లాడుతూ నరేంద్రమోది ప్రధానమంత్రి గా బాధ్యతలు స్వీకరించిన పది సంవత్సరాల కాలంలో మన దేశం విద్య, వైద్య, వ్యవసాయ మరియు పరిశ్రమ రంగాల్లో దూసుకుపోతుందని అన్నారు. ఈసారి తనకి అవకాశం ఇచ్చి ఎంపీగా గెలిపిస్తే ఖమ్మం జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని అన్నారు.
అనంతరం
సహజ్ మార్గ్ మెడిటేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. సహజ్ మార్గ్ సభ్యులు మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వినోద్ రావు కి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.


TEJA NEWS