కష్ట పడి పని చేద్దాం
అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ కు గుణపాఠం నేర్పాలి
ప్రజల అజెండానే మన అజండా
ఏన్కూరు లో జరిగిన ఏన్కూరు, జూలూరుపాడు మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే బాణోత్ మదన్ లాల్
ఆలవికాని వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి ప్రజల్ని మోసం చేసిన కాంగ్రెస్ ను పార్లమెంట్ ఎన్నికల్లో మట్టికరిపించాలని బీఆర్ఎస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఏన్కూరులోని కమ్మ కల్యాణ మండపంలో జరిగిన బీఆర్ ఎస్ పార్టీ ఏన్కూరు, జూలూరుపాడు మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశంలో నామ మాట్లాడారు. కాంగ్రెస్ మోసం గ్రహించిన ప్రజలు పొరపాటు చేశామని గ్రహించి, పార్లమెంట్ ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. ప్రజల ఆలోచన లో మార్పు వచ్చిందని, వారితో మమేకమై బూత్ స్థాయిలో కష్ట పడి పని చేస్తే మనదే విజయమన్నారు. ఏదో చేస్తారనే ఆశతోనే గత ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకి ఓటు వేసి, కష్టాలపాలయ్యారని చెప్పారు. అన్ని వర్గాలు, కులాల ను మోసం చేసిన కాంగ్రెస్ ను ఓడించాలన్నారు. అంబేద్కర్ జయంతి నాడు ఆయన విగ్రహానికి కనీసం పూల దండ కూడా వేయకుండా అవమానించిన కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలని అన్నారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఓడిస్తేనే కనువిప్పు కలుగుతుందని తెలిపారు. మారిన పరిస్థితుల నేపధ్యంలో ప్రజలు బీఆర్ ఎస్ వైపే ఉన్నారని, తనను గెలిపిస్తే ఐదేళ్లు అండగా ఉండి, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని చెప్పారు. ఎంపీ గా జిల్లాకు ఎంతో అభివృద్ధి చేశానని, రూ.8వేల కోట్ల విలువైన జాతీయ రహదారులను తీసుకొచ్చానని తెలిపారు. కేంద్రం మెడలు వంచి రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకొనేలా చేసిన ఘనత బీఆర్ ఎస్ పార్టీ ఎంపీలదన్నారు. బీఆర్ ఎస్ ఎంపీలు గెలిస్తేనే తెలంగాణా ప్రయోజనాలు నెరవేరుతాయని అన్నారు. పార్లమెంట్ కు అత్యధిక శాతం. రోజులు హాజరై, ఎక్కువ ప్రశ్నలు అడిగిన రికార్డ్ తనదని నామ పేర్కొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులు , ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ తెలంగాణా ప్రయోజనాలు, హక్కులు కాపాడాలంటే నామ నాగేశ్వరరావు ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. రాష్ట్రం లో 8 పార్లమెంట్ స్థానాలను బీఆర్ ఎస్ పార్టీ గెలవబోతుందని, మరో 4 స్థానాల్లో గట్టి పోటీ ఇస్తుందని తెలిపారు. ప్రజల ఎజెండానే మన ఎజెండాగా చేసుకుని, ఎన్నికల్లో నామ విజయం కోసం దూసుకుపోవాలన్నారు. కాంగ్రెస్ మోసం వల్ల పునరాలోచనలో ఉన్న ప్రజల్ని చైతన్య పర్చాలన్నారు.
10 ఏళ్ళు కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి తో సుభిక్ష రాష్ట్రంగా చేస్తే కాంగ్రెస్ వచ్చి సంక్షోభంలోకి నెట్టిందని చెప్పారు. ఇప్పుడు ప్రజలకు, కాంగ్రెస్ మధ్య లింక్ తెగిపోయిందని, ప్రజలతో మమేకమై, బీఆర్ ఎస్ విజయానికి సమైఖ్య o గా పని చేయాలన్నారు.420 హామీలతో ప్రజల్ని మోసం చేసిన కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలని మధు పిలుపునిచ్చారు. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా కష్టపడి నామ నాగేశ్వరరావు విజయానికి కృషి చేయాలని అన్నారు. నామ 2 లక్షల ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నారని అన్నారు.
కాంగ్రెస్ కు కర్రు కాసి వాత పెట్టేందుకు ప్రజలు సిద్ధమయ్యారని అన్నారు. స్తబ్దత గా ఉన్న ప్రజలతో కలిసి ముందుకు దూసుకుపోవాలన్నారు కార్యకర్తలే పార్టీకి ఆయువుపట్టు, కొమ్మలని, వారిని కాపాడుకుంటామని చెప్పారు.నామ కష్టజీవని, నామ గెలిస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుందని వద్దిరాజు తెలిపారు. పార్టీ వైరా నియోజకవర్గ ఇంచార్జి , మాజీ ఎమ్మెల్యే బాణోత్ మదన్ లాల్ మాట్లాడుతూ అభివృద్ధి లో దేశంలోనే నెంబర్ వన్ గా ఉన్న రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టి, కరువుకు కారణమైన కాంగ్రెస్ ను ఓడించాలన్నారు.
పార్టీ వైరా నియోజకవర్గ ఇంచార్జి బాణోత్ మదన్ లాల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జూలూరుపాడు జెట్పీటీసీ భూక్యా కళావతి , పార్టీ జిల్లా నాయకులు యల్లంకి సత్యనారాయణ, పోలుదాసు కృష్ణమూర్తి, రైతు నాయకులు యదళ్ళపల్లి వీరభద్రం, పార్టీ మాజీ మండల అధ్యక్షులు చావా వెంకట రామారావు, ఏన్కూరు జెట్పీటీసీ బాదావత్ బుజ్జి, ఎంపీటీసీలు వాసిరెడ్డి మోహనరావు, బాణోత్ సరోజిని, మండల నాయకులు ఇంజం పుల్లయ్య, కొనకంచి వెంకటేశ్వర్లు, యాండ్రాతి మోహన్ రావు, పొన్నం హరిక్రిష్ణ, వైరా మండల పార్టీ అధ్యక్షులు బాణాల వెంకటేశ్వరరావు , మోరం పూడి ప్రసాద్, నామ సేవా సమితి నుంచి పాల్వంచ రాజేష్, చీకటి రాంబాబు, సరిపూడి గోపి, కృష్ణ ప్రసాద్ పాటు వివిధ గ్రామాల నాయకులు, మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీ లు తదితరులు పాల్గొన్నారు.
…………