శ్రీ కామాక్షి సమేత ఏకాంబరనాథ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం పునః నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …
131 – కుత్బుల్లాపూర్ డివిజన్ మాణిక్య నగర్ శ్రీ కామాక్షి సమేత ఏకాంబరనాథ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం పునః నిర్మాణ పనులకు ఆలయ ధర్మకర్తలు, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాజీ కార్పొరేటర్ కే.ఎం.గౌరిష్ తో కలిపి శంకుస్థాపన చేశారు.
ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ గత 32 ఏళ్ల క్రితం మా నాన్న గారైన కేఎం. పాండు ఆధ్వర్యంలో నిర్మించిన ఈ ఆలయం ఎంతో మహిమాన్వితంగా దినదినాభివృద్ధి చెందుతుంది. ఈ ఆలయ పునఃనిర్మాణ పనులను తిరిగి నా చేతులమీదుగా చేపట్టడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రధాన కార్యదర్శి సత్తిరెడ్డి, సీనియర్ నాయకులు కిషోర్ చారి, బాలయ్య, రమేశ్ యాదవ, శ్రీనివాస్, బ్రిజేష్, యాదగిరి, సంజీవరెడ్డి, అక్బర్, నసీర్, వెంకటేష్, అజయ్, రమణారెడ్డి, మధు, భాస్కర్ రెడ్డి, శ్రీనాథ్, శివానంద్, మల్లెష్, నాగన్న, పాపిరెడ్డి, బుచ్చిరెడ్డి, కృష్ణారెడ్డి, నరేందర్, అరుణ, మనోహర, పుష్ప, నీలిమ, భాగ్య, రజియా, మైసమ్మ, మాణిక్య నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పి మహేష్, ప్రధాన కార్యదర్శి ఖలీల్, ఆలయ కమిటీ చైర్మన్ సురేష్, ఉపాధ్యక్షులు నాగరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేష్, నారాయణరెడ్డి, రఘునాథరెడ్డి, మధు, అరుణ్, కెవిఆర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.