TEJA NEWS

లోక్ సభ ఎన్నికల్లో మరోసారి బీజేపీ గెలిస్తే మోడీ చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంటారని కేసీఆర్ అభిప్రాయపడినట్లుగా తెలుస్తోంది. 2028 అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీ 15 ఏళ్ల పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని, తెలంగాణలో బీజేపీ బలపడే అవకాశాలే లేవని కేసీఆర్ అంచనా వేస్తున్నారు.

కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, అవన్నీ అమలు చేయడం సాధ్యం కాదని కేసీఆర్ అన్నట్లు సమాచారం.

రైతు భరోసా, రూ.2 లక్షల రుణమాఫీ, మహిళలకు రూ.2500 లాంటి ఎన్నో హామీలను కాంగ్రెస్ ఇచ్చి ప్రజలను మభ్య పెట్టి ఓట్లు పొందిందన్నారు. వాటన్నింటిని అమలు చేసే పరిస్థితుల్లో కాంగ్రెస్ లేదని, ఇప్పటికే హామీలు నెరవేర్చకపోవడంపై ప్ర జల్లో వ్యతిరేకత స్పష్టం అవుతున్నట్లు పేర్కొన్నారు.

వీటన్నింటి దృష్ట్యా తెలంగాణలో కాంగ్రెస్ పై వ్యతిరేకత, కేంద్రంలో మోడీపై వ్యతిరేకత తమకు అనుకూలంగా మారుతుందని కేసీఆర్ వెల్లడించారని సమాచారం. భవిష్యత్ బీఆర్ఎస్దానని, పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తానంటూ కేసీఆర్ వెల్లడించారని తెలుస్తోంది. పార్టీ నేతలు ఎవరూ అధైర్య పడవద్దని సూచించారని సమాచారం.


TEJA NEWS