TEJA NEWS

జూలపల్లి మండలం, పెద్దాపూర్ గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న .యోగానంద లక్ష్మి నరసింహ స్వామి వారి జాతర మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు ..

ఈ సందర్బంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అలాగే ఆ లక్ష్మీ నరసింహ స్వామి కృపా కటాక్ష ప్రజలపై ఉండాలని మరియు అలాగే లక్ష్మి నరసింహ స్వామి జాతర శుభాకాంక్షలు తెలిపిన తదుపరి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చలివేంద్ర కేంద్రన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు…

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,గ్రామస్తులు,భక్తులు పాల్గొన్నారు.


TEJA NEWS