TEJA NEWS

పాపులన్న మృతదేహాన్ని నివాళులర్పించిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు వై శ్రీనివాసులురెడ్డి

మల్దకల్ మండలం పరిధిలోని బిజ్వారం గ్రామంలో కాంగ్రెస్ యువ నాయకులు బిసన్న తండ్రి పాపులన్న ఉదయం వ్యవసాయ పొలంలో పనిచేస్తున్న సమయంలో సడన్ గా హార్ట్ స్ట్రోక్ రావడంతో అక్కడే కుప్పకూలడంతో చుట్టుపక్కల ఉన్నవాళ్లు వచ్చి కుటుంబ సభ్యులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వెంటనే ఆర్ఎంపీ డాక్టర్ పిలుచుకొని వచ్చి చూసేసరికి పాపులన్న మరణించారని ఆర్ఎంపీ డాక్టర్ తేజ తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే కాంగ్రెస్ సీనియర్ నాయకులు వై శ్రీనివాస్ రెడ్డి, డి సత్య రెడ్డి పాపులన్న ఇంటికి వెళ్లి మృతదేహాన్ని నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. వీరు వెంట కాంగ్రెస్ నాయకులు రాగి మాన్ వెంకటేశ్వర్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, మెకానిక్ గోవిందు, సుభాన్, దుబ్బన్న, పెద్దింటి రాజు కుమార్, వడ్డే గోపాల్, బాబు, శీను,రాజు, తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS