మల్కాజ్ గిరి నియోజకవర్గం వినాయక నగర్ కార్నర్ మీటింగ్ లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సింగిరెడ్డి హరి వర్ధన్ రెడ్డి
మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డి * ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కాజ్ గిరి అసెంబ్లీ నియోజకవర్గం 137 వ డివిజన్ వినాయక నగర్ లో *పార్లమెంటు ఇంఛార్జ్ మైనంపల్లి హన్మంత రావు * ఆధ్వర్యంలో రోడ్ షో, కార్నర్ మీటింగ్ నిర్వహించారు.ఈ కార్నర్ మీటింగ్ కు *మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరి వర్ధన్ రెడ్డి * ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తూ మల్కాజ్ గిరి ఆడబిడ్డ పట్నం సునీతమ్మ ను భారీ మెజారిటీతో గెలిపించాలని, కాంగ్రెస్ పార్టీ మహిళా మణులకు గౌరవం ఇస్తూ చట్టసభలలో మహిళల సమస్యలపై నినదించాలనే ఉద్దేశంతో * ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి * సునీతమ్మ ను పార్లమెంటు అభ్యర్థిగా అధిష్టానం ఆశీస్సులతో నిలిపారని, ఆమెను గెలిపించుకోవాల్సిన భాద్యత ప్రతి మహిళపై ఉందని తెలిపారు.ఈ మీటింగ్ లో బి బ్లాక్ అధ్యక్షులు వెంకటేష్ యాదవ్,టిపిసిసి డెలిగేట్ చంద్ర శేఖర్ మరియు నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు
మల్కాజ్ గిరి ఆడబిడ్డ పట్నం సునీతమ్మ ను ఆశీర్వదించండి
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…