TEJA NEWS

తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెం.1 స్థానంలో నిలిపిన ఏకైక పార్టీ బిఆర్ఎస్, ఏకైక నాయకులు కేసీఆర్ : బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …

బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఈనెల 27వ తేదిన వరంగల్ లో నిర్వహించే వేడుకల సన్నాహక సమావేశంలో భాగంగా 125 – గాజుల రామారం డివిజన్ యండమూరి ఎంక్లెవ్ నందు నిర్వహించిన నాయకుల, కార్యకర్తల సమావేశానికి బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ….అభివృద్ధికి నోచుకోకుండా అడుగడుగునా వివక్షణకు గురైన తెలంగాణ ప్రాంతాన్ని స్వరాష్ట్ర సాధన ద్వారానే అభివృద్ధి సాధ్యమని నమ్మి 2001 లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటుచేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెం.1 స్థాయిలో నిలిపిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ అని, తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ రాష్ట్రంగా మార్చిన నాయకులు మన అధినేత కేసీఆర్ అని అన్నారు. ఇంతటి ఘనతను సాధించిన బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ నియోజక వర్గం నుండి భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లి మన బలాన్ని చాటాలి. ఎందుకు గాను అవసరమైన అన్ని ఏర్పాట్లను నాయకులు కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ భారీ సంఖ్యలో తరలి వెళ్లాలన్నారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు విజయ్ రాంరెడ్డి, పాక్స్ డైరెక్టర్ పరుష శ్రీనివాస్ యాదవ్, సీనియర్ నాయకులు కస్తూరి బాల్ రాజ్, అడ్వకేట్ కమలాకర్, డివిజన్ ఉపాధ్యక్షులు ఇబ్రహీం ఖాన్, ప్రధాన కార్యదర్శి నవాబ్ భాయ్, యూత్ అధ్యక్షులు తెలంగాణ సాయి, నాయకులు ఇమ్రాన్ బేగ్, మూసా ఖాన్, మక్సూద్, సుంకరి చందు, చెట్ల వెంకటేష్, ఆంజనేయులు, దూలప్ప, రంజాన్, మల్లారెడ్డి నగర్ ఫేస్ -2 అధ్యక్షులు నాగభూషణం, మహిళా నాయకురాలు మామి, దుర్గా, ఊర్మిళ, సాజిదా, అనిత తదితరులు పాల్గొన్నారు.