TEJA NEWS

4 కోట్ల 58 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్చెరు : తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కొల్లూరు జంక్షన్, వెలిమల నుండి వెలిమల తాండ, పాటి గ్రామ పరిధిలో నాలుగు కోట్ల 58 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న బీటీ రోడ్ల నిర్మాణ పనులకు. సోమవారం పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. నిర్దేశించిన గడువులోగా పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తెల్లాపూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రాముల గౌడ్, సర్పంచుల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోమిరెడ్డి, పార్టీ మాజీ సర్పంచులు లక్ష్మణ్, స్వామి గౌడ్, పిఎసిఎస్ చైర్మన్ బుచ్చిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ సంగారెడ్డి, హెచ్ఎండిఏ డిఈ రామకృష్ణ, మాజీ కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు సీనియర్ నాయకులు పాల్గొన్నారు