TEJA NEWS

‘టీం శివంగి’.. రాష్ట్రంలో తొలిసారి రంగంలోకి మహిళా కమాండోల బృందం!

నిర్మల్ మామడ అడవిలో చిక్కుకున్న మహిళలను కాపాడేందుకు టీం శివంగి వెళ్లింది.

ఆడవాళ్లు కూడా తక్కువ కాదని నలుగురు మహిళలు కారడవిలోకి వెళ్లారు.

అయితే రాష్ట్రంలో మొదటిసారిగా ఎస్పీ జానకి షర్మిల అధ్యర్యంలో టీం శివంగి అనే మహిళా కమాండోల బృందాన్ని ప్రారంభించారు.

తునికాకు సేకరణకు వెళ్లిన నలుగురు మహిళలు నిర్మల్ దగ్గర ఉన్న మామడ అడవిలో చిక్కుకున్నారు. చీకటిలో దారి తప్పిపోయి ఇంకా దట్టమైన అడవిలోకి వెళ్లిపోయారు. దీంతో వీరిని కాపాడేందుకు మహిళా పోలీసు బృందం వెళ్లింది.

మహిళా కానిస్టేబుళ్లను ఎంపిక చేసి..

ఆ నలుగురు మహిళలు ఏమాత్రం బెదరకుండా కారడవిలోకి వెళ్లారు. అయితే దీనికి ముఖ్య కారణం.. నిర్మల్‌ ఎస్పీ జానకి షర్మిలనే. ఎందులోనూ ఆడవాళ్లు తక్కువ కాదని ఆమె నిరూపించడానికి మొదటిసారిగా టీం శివంగి అనే మహిళా కమాండోల బృందాన్ని ప్రారంభించారు. ఇందులోని సభ్యులను పురుష కమాండోల విధంగానే తీర్చారు. దీనికోసం మహిళా కానిస్టేబుళ్లను ఎంపిక చేసి వారికి 45 రోజుల పాటు కఠిన శిక్షణ అందించారు. వీరికి వ్యాయామాలు చేయించడం, పోరాట నైపుణ్యాల్లో మెలకువలు కూడా నేర్పించారు. అలాగే పేలుడు పదార్థాల వినియోగంపై కూడా అవగాహన కల్పించారు.
అడవుల్లో మ్యాప్ రీడింగ్, ఆకస్మిక వ్యూహాలు అవలంభించడం, శత్రువుల కదలికలను గుర్తించడం, ఎదురు దాడులకు దిగడం వంటి అంశాల్లో వారికి శిక్షణ ఇచ్చారు. అయితే ఈ బృందాన్ని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సీతక్క కలెక్టరేట్‌లో ప్రారంభించారు.