TEJA NEWS

చలో వరంగల్” బిఆర్ఎస్ రజతోత్సవ వేడుకల వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …

ఈరోజు పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఉద్యమ నాయకులు, జీడిమెట్ల డివిజన్ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు సంపత్ మాధవరెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా రూపొందించిన “ఛలో వరంగల్” బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల గోడ పత్రికను బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ…. అడుగడు గునా వివక్షకు గురైన తెలంగాణ ప్రాంతాన్ని స్వరాష్ట్ర సాధనతో బంగారు మయంగా మార్చిన ఘనత బిఆర్ఎస్ అధినేత, పెద్దలు కేసీఆర్ కి, బిఆర్ఎస్ పార్టీకే దక్కుతుందన్నారు. అత్యంత ఘనంగా ఈనెల 27న వరంగల్ లో నిర్వహించే ఈ రజతోత్సవ వేడుకలకు జీడిమెట్ల డివిజన్ నుంచి భారీగా నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లేలా అందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో జీడిమెట్ల డివిజన్ సీనియర్ నాయకులు కుంట సిద్ధిరాములు, సుధాకర్ గౌడ్, గుమ్మడి మధుసూదన్ రాజు, నరేందర్ రెడ్డి, ఎల్లా గౌడ్, అనిల్, పులి మహేష్, నిజాంపేట్ కార్పొరేషన్ సీనియర్ నాయకులు, మాజీ డిప్యూటి మేయర్ ధనరాజ్ యాదవ్, సీనియర్ నాయకులు మురళీ యాదవ్, రవికాంత్ తదితరులు పాల్గొన్నారు.