
విజయవాడ సమగ్రాభివృద్దితోపాటు సుందరీకరణకు ప్రణాళిక సిద్దం చేస్తున్నాము : ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో కలిసి సీసీ రోడ్లు శంకుస్థాపన
4వ డివిజన్ లో పలు సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన
విజయవాడ : ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆధునీకరణలో విజయవాడ రూపు రేఖలు మారుతున్నాయి.రాజధాని అమరావతి ప్రాంతంలో భాగమైన విజయవాడ నగరాన్ని మరింత సుందరీకరణగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాప్రతినిధులైన తమతో పాటు, ప్రభుత్వ అధికారులను ఆదేశించారు. అందులో భాగంలోనే విజయవాడ ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొండా ఉమామహేశ్వరరావు, సుజనా చౌదరిలతో కలిసి విజయవాడ సమగ్ర అభివృద్ధితో పాటు సుందరీకరణకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు.
తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ శ్రీనివాస నగర్ బ్యాంక్ కాలనీ వాటర్ ట్యాంక్ ప్రాంతంలోని రోడ్ నెంబర్ 5కు, భారతి నగర్ లో 13వ,14వ,15వ,10b,4a రోడ్లకి సుమారు 2కోట్ల రూపాయల నిధులతో సిసి రోడ్ల పనులకు సోమవారం ఎంపి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) మాట్లాడుతూ విజయవాడ నగరాభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టిపెట్టారని, అందుకే నగరంలోని రోడ్ల అభివృద్ధి పనులు శరగవేగంగా జరుగుతున్నాయన్నారు.
ఇటీవల మంత్రి నారాయణ సీ.ఆర్.డి.ఏ అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో నగరంలోని డ్రైనేజీ, ఎస్టీపీ సమస్యలపై చర్చించడం జరిగిందన్నారు.అదే విధంగా వర్షం పడిన సమయంలో నోవాటెల్ సమీపంలో వున్న రెండు ఫ్లై ఓవర్స్ కి మధ్య రోడ్లపై వర్షం నీరు నిలిచి పోయే విషయం, ఫ్లై ఓవర్స్ కి పైప్ లైన్స్ లేకపోవటం పై నుంచి రోడ్లకి మీదకి నీళ్లు పడే సమస్య నేషనల్ హైవే అధికారుల దృష్టి తీసుకువెళ్లగా త్వరలోనే ఆ సమస్యలను పరిష్కరిస్తామన్నారని తెలిపారు. ఇక నేషనల్ హైవే అథారిటీ అధికారులు బెంజ్ సర్కిల్ నుంచి ప్రారంభించాల్సిన డ్రైనేజీ పనులు నెలరోజుల్లో కార్యరూపంలోకి తీసుకువస్తారని తెలిపారు. విజయవాడనగరాన్ని మరింత సుందరీణ చేసేందుకు ప్రజాప్రతినిధులందరూ కలిసి కట్టుగా కృషి చేస్తామని ఎంపి కేశినేని శివనాథ్ తెలిపారు.
అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ విజయవాడ నగరాన్ని సమగ్రంగా అభివృద్ది పర్చటానికి సీఎం చంద్రబాబు ప్రత్యేకమైన శ్రద్ధ వహించారు. నిధుల సమకూర్చి ఈనాలుగున్నరేళ్లలో నగరాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో వున్నారని తెలిపారు. చిన్నపాటి వర్షానికే మునిగిపోయే ఈ ప్రాంతం అభివృద్ది కోసం సీఆర్డీయే నిధుల నుంచి 200 కోట్ల రూపాయలు మంజూరు చేయటం జరిగిందన్నారు. నిడమానురు, కంకిపాడు నుంచి విజయవాడ లోకి సులువుగా వచ్చేందుకు అవుటర్ రోడ్లు నిర్మాణ అభివృద్ది పనుల కోసం రూ.50 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగిందన్నారు. ఈ నిధులతో ప్రధాన సమస్యలన్నీ పరిష్కారమవుతాయన్నారు.
రాబోయే రోజుల్లో నగరాభివృద్ది మాస్టర్ ప్లాన్ తో పాటు డి.పి.ఆర్ ఇస్తే అవసరమైతే రెండు వేల కోట్ల రూపాయలు సమకూరుస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు వాగ్ధానం చేశారు. ఆ డిపిఆర్ తయారు చేయటం కోసం ఎంపి కేశినేని శివనాథ్ తో పాటు ఇతర ఎమ్మెల్యేలతో కలిసి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో విజయవాడ నగరం భావితరాలకు భవిష్యత్తు ఇచ్చే నగరంగా తయారు కానుందన్నారు.
కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు మాట్లాడుతూ విజయవాడ సమగ్రాభివృద్దికి కట్టుబడి ఎంపి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పనిచేస్తున్నారన్నారు.4వ డివిజన్ లో ఆరు సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేయటం జరిగిందన్నారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోనే కాదు విజయవాడలో అభివృద్ది పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. విజయవాడ భవిష్యత్తులో ఎలాంటి ముంపుకి గురికాకుండా వుండేందుకు సీఆర్డీయే అధికారులతో కలిసి కృషి చేస్తున్న ఎంపి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహనకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు , కార్పొరేటర్ దేవినేని అపర్ణ , ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు చలసాని రమణ , టిడిపి నాయకులు కోడూరు ఆంజనేయ వాసు , యెర్నేని వేదవ్యాస్ , వి. గోపాలకృష్ణ,జి. సురేంద్ర,రాజమణి,మైనేని సాయిబాబు,పిప్రసాద్, జి. నాగేశ్వరరావు ,చలసాని రోజా , సర్కిల్ 3 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సామ్రాజ్యం , డి ఈ పి రామారావు, ఏఈ దీక్షిత్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.
