TEJA NEWS

సర్వేనెంబర్ 354 లోని ప్రభుత్వ భూములను కాపాడండి.
సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.

 ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా  కుత్బుల్లాపూర్ మండల రెవెన్యూ అధికారి కార్యాలయంలో సిపిఐ ఆధ్వర్యంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ కరీముల్లా  కి కుత్బుల్లాపూర్ లోని ప్రభుత్వ భూములను కాపాడాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
    ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో గాజులరామారం సర్వేనెంబర్ 307,326,342,329లలో ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జాదారులు కబ్జా చేయడం దాన్ని ఆపకపోవడం వల్ల మళ్ళి ఒకసారి నేడు తాజాగా కబ్జాదారులు సర్వేనెంబర్ 354 లో ఉన్న 13 ఎకరాల ప్రభుత్వ భూమి చుట్టూ రేకుల షీట్లు వేసి కబ్జా చేశారని ఈ కబ్జాలపై ఇప్పటికీ అనేక కథనాలు వచ్చినప్పటికీ రెవెన్యూ అధికారులు వాటిపైన స్పందించకపోవడం దురదృష్టకరమని వెంటనే ఆ ప్రభుత్వ భూములను కాపాడాలని లేకపోతే వచ్చే వారం లోపు ఈ అంశం పైన జిల్లా కలెక్టర్ మరియు హైడ్రా కమిషనర్  కి సిపిఐ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేస్తామని అన్నారు.
దీనిపై రెవెన్యూ ఇన్స్పెక్టర్ కరిముల్లా  స్పందిస్తూ వారికి నోటీసులు పంపించామని అది ప్రభుత్వ భూమిని వారి దగ్గర ఏమైనా కాగితాలు ఉంటే తీసుకురమ్మని చెప్పామని కచ్చితంగా ప్రభుత్వ భూములను కాపాడుతామని సిపిఐ నాయకత్వానికి హామీ ఇవ్వడం జరిగింది.
   ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు జంబు, ప్రభాకర్, వెంకటేష్, ఆదిత్య,కార్తికులు పాల్గొన్నారు.