
భూపతి ఆనందరావు మృతి పార్టీకి తీరని లోటు
బీజేపీ నేత భూపతి ఆనందరావు (65) ఆదివారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు.
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ టీడీపీ నాయకులు వడ్డాది రమణ,ఎన్డీఏ కూటమి నేతలతో కలిసి వించిపేటలోని వారి నివాసానికి వెళ్లి భూపతి ఆనందరావు భౌతిక కాయానికి పుష్పాంజలి ఘటించారు.
వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ భూపతి ఆనందరావు మృతి పార్టీకి , కుటుంబానికి తీరని లోటన్నారు.
వారి కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా అండగా ఉంటామని ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ తెలిపారు.
