హైదరాబాద్:
లోక్ సభ ఎన్నికల ప్రచారం లో తెలంగాణ బీజేపీ స్పీడ్ పెంచింది. పోలింగ్ కు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉండటంతో పార్టీ జాతీయ స్థాయి నేతలు రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.
ఇప్పటి వరకు అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర పార్టీ నేతలు రాష్ట్రంలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇకనుంచి జాతీయ స్థాయి అగ్రనేతలు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించేందుకు సిద్ధమ య్యారు.
ఈ క్రమంలో జేపీ నడ్డా, అన్నామలైతో పాటు పలు రాష్ట్రాల బీజేపీ సీఎంలు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గోనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇవాళ రాష్ట్రం లోని మూడు చోట్ల బహిరం గ సభల్లో పాల్గోనున్నారు.
ఉదయం 10గంటలకు పెద్దపల్లి నియోజకవర్గంలో నిర్వహించ బహిరంగ సభలో పాల్గొని ప్రసం గిస్తారు.
అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు భువ నగిరి, మధ్యాహ్నం 3గంటలకు నల్గొండ బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటారు. మరోవైపు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామీ, రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మలుసైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.
ఉదయం 10గంటలకు సికింద్రాబాద్ పార్లమెంట్ లోని ముషీరాబాద్ లో పుష్కర్ సింగ్ దామీ బీజేపీ అభ్యర్థి విజయాన్ని కాంక్షి స్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అనంతరం నర్సంపేటలో జరిగే బహి రంగ సభలో పాల్గొంటారు.
రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ సికింద్రాబాద్ లోని ఇంపిరియల్ గార్డెన్ లో నార్త్ ఇండియా ప్రజలతో సమావేశం కానున్నారు.