ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా షాద్ నగర్ నియోజకవర్గం బుచ్చిగుడా గ్రామంలో హనుమాన్ సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలి అని కోరారు. బట్టేవాజ్ పార్టీలు బీజేపీ, బిఅరెస్ రెండు మోసం చేసే పార్టీలు కాబట్టి వాళ్ళు చెప్పే ముచ్చట్లు నమ్మొద్దు అని అన్నారు. రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగుతుందో దేశంలో కూడా ప్రజా పాలన రావాలంటే కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేయాలని కోరారు.. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఖాజా ఇద్రిస్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్లా శ్రీకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తాండ్ర కాశినాథ్ రెడ్డి, తిరుపతి రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..