TEJA NEWS

రాజ‌స్థాన్‌లోని హిందుస్తాన్ కాప‌ర్ లిమిటెడ్ కంపెనీ గ‌నిలో చిక్కుకున్న 15 మందిని ర‌క్షించారు.

నీమ్ కా థానా జిల్లాలో ఉన్న కోలిహ‌న్ గ‌నిలో గ‌త రాత్రి నుంచి 15 మంది ఉద్యోగులు చిక్కుకున్నారు. ఈరోజు ఉదయం వారిని ర‌క్షించిన‌ట్లు అధికారులు చెప్పారు.

అర్ద రాత్రి గ‌నిలో ఆ 15 మంది చిక్కు కున్న‌ట్లు అధికారులు తెలిపారు. ఉద్యోగుల‌ను తీసుకువెళ్లే వర్టిక‌ల్ లిఫ్ట్ కూల‌డంతో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

గాయ‌ప‌డ్డ వారిలో ముగ్గుర్ని ఆస్ప‌త్రికి తీసుకువెళ్లిన‌ట్లు డాక్ట‌ర్ మ‌హేంద్ర సింగ్ తెలిపారు. ఇక మ‌రో 12 మందిని బ‌య‌ట‌కు తీసుకు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

రెస్క్యూ ఆప‌రేష‌న్స్‌ను వేగ‌వంతం చేయాల‌ని రాజ‌స్థాన్ సీఎం భ‌జ‌న్‌లాల్ శ‌ర్మ అధికారుల‌ను ఆదేశిం చారు. కోలిహ‌న్ గ‌నిలో ఉన్న లిఫ్ట్ రోప్ తెగిపోవ‌డం వ‌ల్ల కార్మికులు గ‌నిలోనే చిక్కుకుపోయారు


TEJA NEWS