TEJA NEWS

సింహాచలంలో ఘనంగా వైశాఖ పౌర్ణమి…

విశాఖ సింహాచలంలో సోమవారం వైశాఖ పౌర్ణమిని ఘనంగా నిర్వహించారు. వేకువజామున అర్చకులు స్వామి వారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాతఃకాల పూజలు జరిపారు. “మూడురోజుల పాటు భక్తితో స్వామికి చందన చెక్కలను అరగతీసి తీసిన సుగంధ ద్రవ్యాలతో మిళితమైన మూడు మణుగుల (సుమారు 125 కిలోలు) శ్రీ గంధాన్ని స్వామికి సమర్పించారు”

  • స్వామివార్ల ఉత్సవమూర్తులను కొలువు దీర్చి పంచామృత స్వపన తిరుమంజన సేవలు జరిపించారు..