TEJA NEWS

మిరియం గురవయ్యను పరామర్శించిన దారపనేని బ్రదర్స్

కనిగిరి నియోజకవర్గం పామూరు మండలం తూర్పు కోడిగుడ్లపాడు గ్రామపంచాయతీ పోతవరం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు మిరియం గురవయ్య ఇటీవల గుండెపోటు వ్యాధితో బాధపడుతూ ఒంగోలు కిమ్స్ కార్పొరేట్ హాస్పటల్లో మెరుగైన వైద్యం చేయించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగివచ్చారు. కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ , తూర్పు కోడిగుడ్లపాడు మాజీ సర్పంచ్ దారపనేని జనార్దన్ రావు మిరియం గురవయ్యను పరామర్శించి సోదరుడు మిరియం సుబ్బరాయుడును యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. దారపనేని చంద్రశేఖర్ గురవయ్యతో ఆరోగ్యం పై అశ్రద్ధ విడనాడి ఆరోగ్యవంతులుగా ఉండేందుకు కృషి చేయాలన్నారు. నాగినేని రమేష్ బాబు, చెనికల చిన మాల కొండయ్య, నాగేశ్వరరావు, శ్రీనివాసులు, కొండయ్య (కరణం ) మానం మల్లికార్జునరావు, ధనియాల తిరుపతయ్య మిరియం గురవయ్యను పరామర్శించిన వారిలో ఉన్నారు.