*ఇండియా కూటమిలో సిపిఐ సహకారం కోరిన డాక్టర్ రామకృష్ణ
వరంగల్ ఎంపీ ఆస్పిరెంట్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ
ఈరోజు సిపిఐ పార్లమెంటరీ స్థాయి మీటింగ్ హరిత హోటల్ లో వరంగల్ ఎంపీ ఆస్పిరెంట్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ పాల్గొన్నారు.
అదేవిధంగా ఎమ్మెల్యే కూనమ్నేని సాంబ శివరావు మేకలరవి బిక్షపతి ఆధ్వర్యంలో పాల్గొనడం జరిగింది. ఈ మీటింగ్ లో పార్లమెంట్ కి సంబంధించిన విషయాలను చర్చించడం అలాగే డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ మాట్లాడుతూ వరంగల్ పార్లమెంట్ స్థానానికి సిపిఐ పార్టీ మద్దతుగా నిలవాలని ప్రజలందరి సహకారాలు ఉండాలని అందరంకలిసి పనిచేయాలని ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణ విజ్ఞప్తి చేసారు.
ఈ కార్యక్రమంలో భాగంగా సిపిఐ పార్టీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.