Bribe for allotment of house number
ఎల్బీనగర్ : ఇంటి నంబరు కేటాయింపునకు లంచం తీసుకుంటూ మున్సిపల్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్మన్‌ఘాట్‌కు చెందిన విశ్రాంత ఉద్యోగి నర్సింహారెడ్డి స్థానికంగా ఇటీవల ఇంటిని నిర్మించుకున్నాడు. నిర్మాణం పూర్తయిన తర్వాత అసెస్మెంట్, ఇంటి నంబరు కోసం దరఖాస్తు చేసుకొని, కట్టాల్సిన నగదు రూ.67 వేలు ఆన్లైన్లోనే చెల్లించాడు.
రుసుం చెల్లించిన ఇంటి నంబరు కేటాయించకపోవడంతో ట్యాక్స్ ఇన్స్పెక్టర్ విజయ్ భార్గవ్ కృష్ణను సంప్రదించాడు. అతడు రూ.10 వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు రంగారెడ్డి జిల్లా ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సాయంత్రం సరూర్‌నగర్ సర్కిల్ కార్యాలయంలో బాధితుడి నుంచి నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్ విజయ్ భార్గవ్ కృష్ణను అదుపులోకి తీసుకున్నారు….