TEJA NEWS

మనపై ట్రంప్ పెత్తనమేంటి

  • మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలి
  • తిరుపతిలో మీడియాతో సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా
  • తిరుపతి: దక్షిణ ఆశియా దేశాలపై ట్రంప్ పెత్తనమేంటి, ఆయనకు భారత ప్రధాని తలొగ్గి వ్యవహరించడం ఏంటని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ప్రశ్నించారు. తిరుపతి సిపిఐ కార్యాలయంలో గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతి నగరంలో ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహా సభలు నిర్వహిస్తుడడం శుభపరిణామం అన్నారు. దేశ వ్యాప్తంగా 24 రాష్ట్రాల నుంచి యువత మహాసభల్లో పాల్గొనేందుకు ఉత్సాహం చూపడం సంతోషించాల్సిన విషయం అన్నారు. మహాసభల్లో ప్రధానంగా విద్య, ఉద్యోగ, ఉపాధి తదితర అంశాలను చర్చించి నిర్దిష్టమైన అజెండాతో ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి వాటిని సాధించుకొనేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. ఇటీవల జరిగిన ‘ఆపరేషన్ సింధూర్’ అంశంపై ఆయన మట్లాడుతూ పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రమూకలు అమాయక ప్రజలను చంపడం అత్యంత హేయమైన చర్య అని, అలాంటి ఉగ్రవాదాన్ని సమూలంగా రూపుమాపేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధానంగా ఈ అంశంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిలో అనేక లోపాలు ఉన్నాయని ఆయన తప్పుబట్టారు.
  • ఉగ్రవాదులను తుదముట్టించే క్రమంలో భారత్, పాక్ లు ప్రకటించక ముందే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కల్పుల విరమణ పై స్పందించడం లో అంతరం ఏమిటి అన్నారు. దాంతో భారత్, పాక్ ఇరుదేశాలు కాల్పుల విరమణ చేయడంపై పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయని అన్నారు. కాల్పుల విరమణ విషయంగా అమెరికా అధ్యక్షుని మాటకు భారత ప్రధాని కట్టుబడిన వ్యవహారం అత్యంత బాధాకరమన్నారు. దక్షిణ ఆశియా దేశాలపై పెత్తనం చెలాయిస్తున్న ట్రంప్ నకు భారత ప్రధాని వత్తాసు పలకడం భారత ప్రజల మనోభావాలను కించపరిచినట్లే అవుతుందన్నారు. అదే క్రమంలో పెహల్గాం ఘటనపై ఇటీవల జాతిని ఉద్దేశించి మాట్లాడిన భారత ప్రధాని నరేంద్ర మోడీ అనేక అంశాలకు సమాధానం ఇవ్వలేదన్నారు. ఏప్రిల్ 22న పెహల్గాంలో జరిగిన ఘటనపై మెగా విభాగం వైఫల్యం పై స్పందించలేదు అన్నారు. కాల్పుల విరమణ అంశంలో, అఖిల పక్ష సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ రాకపోవడం సరైంది కాదని పేర్కొన్నారు. అయితే ‘ఆపరేషన్ సింధూర్’లో భారత సైన్యం చూపిన తెగువ, ప్రతిస్పందించిన తీరు యావత్ భారత ప్రజానికానికి గర్వకారణం అంటూ అభివర్ణించారు. పాకిస్తాన్ తో కాల్పుల విరమణ ఒప్పందం వెనుక అంశాలపై భారత ప్రజల నుంచి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న వేళ కేంద్రం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాల్సి ఉందన్నారు. ఈ సమావేశంలో పెహలగాం ఘటనపై పూర్తిస్థాయిలో చర్చించాలని డిమాండ్ చేశారు. ఈ విలేఖరుల సమావేశంలో సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.హరినాథ్ రెడ్డి, జి. ఈశ్వరయ్య, జిల్లా కార్యదర్శి పి మురళి, నగర కార్యదర్శి విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.