
తుడా పరిధిలో కొత్త లేఔట్ల ఏర్పాటుకు స్థలాలను పరిశీలన చేస్తున్నాం.
తుడా ఉపాధ్యక్షులు ఎన్.మౌర్య
తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలోని సూళ్లూరు పేట, నాయుడుపేట, వెంకటగిరి ప్రాంతాల్లో కొత్తగా లేఅవుట్లు ఏర్పాటు చేసేందుకు స్థలాలను పరిశీలన చేస్తున్నామని తుడా ఉపాధ్యక్షులు ఎన్.మౌర్య అన్నారు. తుడా అధికారులతో కలసి నాయుడుపేట, సూళ్లూరుపేట, వెంకటగిరి ప్రాంతాల్లో లేఅవుట్లు వేయడానికి అనువైన ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారంగా తుడా పరిధిలో ప్రజలకు ఉపయోగకరంగా ఉండే భూములను గుర్తిస్తున్నామని అన్నారు. ఆ భూములు కొనుగోలు చేసి అందులో లేఅవుట్లు వేసి అభివృద్ధి చేస్తామని అన్నారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఉపాధ్యక్షులను కలిసి సూళ్లూరుపేట లోని పార్క్ ను, రోడ్లను అభివృద్ధి చేయాలని కోరారు. తుడా పరిధిలో బడ్జెట్ పరిశీలించి అన్ని పనులు చేయిస్తామని అన్నారు. ఈ స్థల పరిశీలనలో తుడా సూపరింటెండెంట్ ఇంజినీర్ కృష్ణారెడ్డి, ఈ.ఈ. రవీంద్ర, సిపిఒ దేవికుమారి, ఎల్.ఏ.ఓ. సుజన, నాయుడుపేట, సూళ్లూరుపేట, వెంకటగిరి అధికారులు, సిబ్బంది ఉన్నారు.
