TEJA NEWS

జనభేరి బహిరంగ సభ పోస్టర్ ఆవిష్కరణ సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి…. రాచాల

జిల్లాలో నెలకొన్న సమస్యల పైనే జనభేరి సభలో ప్రస్తావన


వనపర్తి జిల్లాలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారం… హక్కుల సాధనకై ఈనెల 28న వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించతలపెట్టిన “జనభేరి” బహిరంగ సభను విజయవంతం చేయాలని బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.

మంగళవారం శ్రీరంగాపూర్ రంగనాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం జనభేరి బహిరంగ సభ గోడపత్రికను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా రాచాల మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నామని, గత ప్రభుత్వంలో ఎన్నో అక్రమ కేసులు పెట్టినా కూడా వాటిని ధైర్యంగా ఎదుర్కొని అనేక ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేశామన్నారు.

ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ఇటీవల వనపర్తి జిల్లాలో చేపట్టిన మార్నింగ్ వాక్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు.

వనపర్తి జిల్లాలోని అన్ని మండలాల్లో నెలకొన్న ప్రధాన సమస్యలు జనభేరి సభలో ప్రస్తావిస్తామన్నారు

సమగ్ర కుల గణన చేపట్టి,
బీసీ రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి, కేంద్రానికి పంపిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి జనభేరి సభలో కృతజ్ఞతలు తెలుపుతామన్నారు.

జనభేరి సభలో ప్రముఖ జానపద కళాకారులు జంగిరెడ్డి మరియు జానులిరి ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

కావున పార్టీలు, మతాలు, కులాలకతీతంగా ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా హాజరై బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జెఎసి జిల్లా అధ్యక్షుడు వనం తిరుపతయ్య యాదవ్, మండల అధ్యక్షులు ధర్మేంద్ర సాగర్, ప్రధాన కార్యదర్శి అస్కని రమేష్, రాష్ట్ర కార్యదర్శి వివి గౌడ్, జిల్లా కార్యదర్శి బత్తుల జితేందర్, కొత్తకోట మండల అధ్యక్షుడు అంజన్న యాదవ్,రవి నాయుడు, బాలచంద్రయ్య, రవి సాగర్, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.