
గ్రామీణ విద్యార్థులలో అన్ని రంగాలలో పోటీ తత్వం పెరగాలి… జిల్లా విద్యా శాఖ అధికారి అబ్దుల్ గని
వనపర్తి
గ్రామీణ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు అన్ని రంగాలలో పోటీ తత్వాన్ని పెంపొందించుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి అబ్దుల్ గని అన్నారు.మంగళవారం పెబ్బేరు మండలం యాపర్ల జడ్పీ హై స్కూల్ లో జరిగిన పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల బహుమతి ప్రధాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డిఇఒ మాట్లాడుతూ నేడు ప్రభుత్వo విద్యను అన్ని వర్గాల,అన్ని ప్రాంతాల వారికి చేరువ చేసిందని ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోని పోటీ పడుతూ పలితాలు సాధించాలని కోరారు. పాఠశాలకు భౌతిక వనరులు సమకూర్చడంలో యాపర్ల గ్రామస్తుల ఆర్థిక సహకారం జిల్లాకు స్పూర్తి వంతంగా నిలిచిందని పది లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టడం అభినందనీయం అని పేర్కొన్నారు. ఈ పాఠశాల స్థాయిలో పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన శివాని,శివలక్ష్మి అను విద్యార్థులకు గ్రామ ఎన్నారై సూదిరెడ్డి శ్రీహరి రెడ్డి ఒక్కొక్కరికి దాదాపు నలభై వేల రూపాయల విలువ చేసే రెండు గ్రాముల బంగారు నాణాలు అందజేయడం ప్రశంసనీయమని డిఇఒ అబ్దుల్ గని కొనియాడారు. ఈ సందర్భంగా హెడ్మాస్టర్ పలుస శంకర్ గౌడ్ పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులను గూర్చి వివరించారు.పాఠశాల ప్రాంగణంలో నిర్మించిన విద్యార్థుల చైతన్య కళా వేదికను డిఈఓ ప్రారంభించారు.
ఈనాటి కార్యక్రమంలో డిసిఈబి సెక్రటరీ సూర చంద్ర శేఖర్, ఎఎంఒ మహానంది,గ్రామ పెద్దలు నరేందర్ రెడ్డి స్వరాజ్యం బాబు రెడ్డి ఉపాధ్యాయులు మైనొద్దీన్ ఈశ్వర్ రెడ్డి వెంకటేశ్వర్లు విద్యార్థుల తల్లి దండ్రులు తదితరులు పాల్గొన్నారు.
