An 11-year-old child died of a brain tumor
బ్రెయిన్ ట్యూమర్ తో 11 ఏళ్ల చిన్నారి మృతి
మొయినాబాద్ మండల్ బాకారం గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది 11 ఏళ్ల చిన్నారి శ్రీజ బ్రెయిన్ ట్యూమర్ తో గత మూడు నెలల నుండి బాధపడుతూ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఉదయం తుది శ్వాస విడిచింది. తండ్రి ప్రవీణ్ కుమార్ వృత్తిరీత్యా ఆటో డ్రైవర్ ఇద్దరు కూతుర్లు ఒక కుమారుడు వున్నారు. శ్రీజ లేని లోటు మాకు ఎవరు తీరుస్తారు అని తల్లి తండ్రులు గుండెలు బడుకుంటూ ఏడ్చారు. గ్రామం లో తీవ్ర విషాదం నెలకుంది. శ్రీజ ఇంటికి వచ్చిన బంధువులు గ్రామస్తులు కుటుంబ సభ్యులను ఓదార్చారు.