TEJA NEWS

బల్మూరు వెంకట్,మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీలు గా ఏకగ్రీవం

తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన రెండు స్థానాలకు ఎమ్మెల్సీలుగా ఎన్ఎస్‌యూఐ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు దూరంగా ఉండటంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇద్దరు యూనానిమస్‌గా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీ పదవులకు ఇతర పార్టీల నుండి ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికైన‌ట్లు అసెంబ్లీ సెక్రటరీ ఇవాళ ప్రకటించారు.

ఈ క్రమంలో ఎమ్మెల్సీగా ఎన్నికైన బల్మూరి వెంకట్ ధృవీకరణ పత్రం తీసుకు నేందుకు అసెంబ్లీకి అభిమానులు, కార్యకర్త లతో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరారు. ఎమ్మెల్సీలుగా ఎన్నికైన మహేష్ గౌడ్, వెంకట్‌లకు పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

కాగా, బీఆర్ఎస్ నేతలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. దీంతో వీరిద్దరూ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు.

పాడి, కడియం రాజీనామాలకు మండలి చైర్మన్ ఆమోదం తెలపడంతో ఎమ్మెల్యే కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు స్థానాలను భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈసీ రెండు స్థానాలకు వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇవ్వడంతో అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యాబలం రీత్యా రెండు స్థానాలు అధికార కాంగ్రెస్ పార్టీకే దక్కే ఛాన్స్ వచ్చింది.


TEJA NEWS