Corporator Venkatesh Goud inspected the CC road
124 డివిజన్ శంశిగుడా పరిధిలోని ఇంద్రహిల్స్ మరియు మహంకాళి నగర్ లోని సీసీ రోడ్ల కొరకు గతంలో యాభై లక్షల రూపాయల నిధులు మంజూరై త్వరలో నిర్మాణ పనులు మొదలుకానున్న సీసీ రోడ్లను డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఇంద్ర హిల్స్ శివాలయం జుంక్షన్ వద్ద సీసీ రోడ్డును పరిశీలించిన కార్పొరేటర్ అక్కడ వాటర్ లికేజీని గమనించి సంబంధిత అధికారులతో మాట్లాడి లీకేజీ సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ ఇంద్ర హిల్స్ శివాలయం జుంక్షన్ సీసీ రోడ్డు విషయమై కాంట్రాక్టర్ మరియు సంబంధిత అధికారులతో మాట్లాడడం జరిగిందని అన్నారు. అతిత్వరలో నిర్మాణ పనులు మొదలుపెట్టి, జుంక్షన్ రోడ్డు పనులు నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేస్తామని అన్నారు. నిర్మాణ పనులు పూర్తయిన తరువాత వాహనదారులు మరియు కాలనీ వాసులు ఇబ్బంది పడకుండా ప్రయాణం సాఫీగా చేయవచ్చని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వెంకట్ నాయక్, ఎఇ శ్రావణి, వర్క్ ఇస్పెక్టర్ రవి కుమార్, తదితరులు పాల్గొన్నారు.